📄 ePaper
Thursday, November 5, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి భరోసా

అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి భరోసా

📰 Generate e-Paper Clip

-65 మందికి రూ.34.15 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

-మరో ఇద్దరికి రూ.4.09 లక్షల విలువైన ఎల్‌ఓసీలు అందజేత

సూళ్లూరుపేట, సత్య వెలుగు న్యూస్: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్సలు పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు.

శనివారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 65 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.34,15,234 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే అత్యవసర వైద్య చికిత్సల కోసం మరో ఇద్దరు లబ్ధిదారులకు రూ.4,09,802 విలువైన లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ)లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు 738 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.6,39,31,190 (సుమారు రూ.6.39 కోట్లు) ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు.

పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వైద్య ఖర్చుల కారణంగా ఏ పేద కుటుంబమూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!