📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివీరపరెడ్డిపాలెంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ సమావేశం

వీరపరెడ్డిపాలెంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ సమావేశం

📰 Generate e-Paper Clip

–మాదిగల హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి: నీరుపాకు వినోద్ కుమార్ మాదిగ

పుత్తూరు, సత్య వెలుగు న్యూస్,అక్టోబర్ 21 :ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, ఎంఎస్‌పీ రాష్ట్ర సీనియర్ నాయకులు, తిరుపతి జిల్లా ఇన్‌చార్జ్ వర్ల దేవదాసు మాదిగ సూచనలతో నగరి నియోజకవర్గం, పుత్తూరు మండలం, పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని వీరపరెడ్డిపాలెం మాదిగ పల్లెలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు.

వీరపరెడ్డిపాలెం గ్రామ ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు తిరుపతి మహేష్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పుత్తూరు మండల ఇన్‌చార్జ్ నీరుపాకు వినోద్ కుమార్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదిగ జాతి అభ్యున్నతి కోసం, సమాజ సంక్షేమం కోసం మందకృష్ణ మాదిగ చేస్తున్న సేవలను వివరించారు. సమాజంలో మాదిగలు ఎదుర్కొంటున్న అన్యాయాలు, వివక్ష, సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రస్తావిస్తూ, హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ (MRPS), మహాజన సోషలిస్ట్ పార్టీ (MSP) నాయకులు, కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా, విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందించేందుకు ప్రతి గ్రామంలో ఎంఎస్‌ఎఫ్ (MSF) బలోపేతం కావాలని, మాదిగ విద్యార్థులు ఎంఎస్‌ఎఫ్‌లో చేరి విద్యా, సామాజిక రంగాల్లో ముందుకు సాగాలని కోరారు.

మాదిగల హక్కులు, విద్యాభివృద్ధి, సామాజిక సమానత్వం సాధించేందుకు గ్రామస్థాయిలో సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!