📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినగరి మున్సిపల్ చైర్మన్ వ్యవహారంలో అక్రమాలపై రోజా ఫిర్యాదు!

నగరి మున్సిపల్ చైర్మన్ వ్యవహారంలో అక్రమాలపై రోజా ఫిర్యాదు!

📰 Generate e-Paper Clip

-కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.. -బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తానని స్పష్టం

సత్య వెలుగు న్యూస్ ,పుత్తూరు:అక్టోబర్ 25, 2026:నగరి మున్సిపల్ చైర్మన్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఆర్కే రోజా జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, టీడీపీ అభ్యర్థి శ్రీనివాసన్‌కు పాత తేదీతో డిక్లరేషన్ జారీ చేశారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంలో నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్, ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు.

అదేవిధంగా, విజయపురం మండలం కోసలనగరం ఎంపీటీసీ అభ్యర్థి భవాని నామినేషన్ తిరస్కరణ అంశంపై కూడా జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ వ్యవహారాల్లో బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు ఎంతవరకైనా పోరాటం కొనసాగిస్తానని ఆర్కే రోజా స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!