-శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పిలుపు
సత్య వెలుగు న్యూస్ | శ్రీకాళహస్తి:ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వాసుదేవ నాయుడిని అఖండ మెజార్టీతో గెలిపించాలని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకులకు ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే వాసుదేవ నాయుడికి ఓటర్లు తమ విలువైన ఓటుతో మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. వాసుదేవ నాయుడి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అంజూరు తారక శ్రీనివాసులు కోరారు.

