📄 ePaper
Thursday, November 5, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ తంబిరెడ్డి రాజేశ్వరమ్మ

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ తంబిరెడ్డి రాజేశ్వరమ్మ

📰 Generate e-Paper Clip

నెల్లూరు | సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 4: నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఘన విజయం సాధించిన తంబిరెడ్డి రాజేశ్వరమ్మ బుధవారం నెల్లూరులో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డికి, సూళ్లూరుపేట నియోజకవర్గ పరిశీలకుడు బెరదోలు శ్రీకాంత్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం నాయకులు తంబిరెడ్డి రాజేశ్వరమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. నాయుడుపేట పట్టణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

ఈ సందర్భంగా నాయకుల మధ్య ఆత్మీయ పలకరింపులు చోటుచేసుకోగా, పలు రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, నాయుడుపేట టౌన్ అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్ధన్ రెడ్డి, తెమ్మెర గ్రూప్ అధినేత తంబిరెడ్డి మోహన్ రెడ్డి, ముత్యాల రెడ్డి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!