📄 ePaper
Thursday, November 5, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ రిలీఫ్!

పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ రిలీఫ్!

📰 Generate e-Paper Clip

-ఫారం-6 ద్వారా మళ్లీ ఓటు హక్కు పొందే అవకాశం..

-తప్పుడు డిక్లరేషన్ భయాలకు చెక్!

సత్య వెలుగు న్యూస్, నవంబర్ 4: ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఓటర్ల జాబితాలో తమ పేర్లు తొలగిపోయిన వారు తిరిగి ఓటు హక్కు పొందేందుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో వివిధ కారణాలతో ఓటర్ల జాబితాలో పేరు కోల్పోయిన అర్హులైన పౌరులకు మరోసారి తమ ఓటు హక్కును పొందే అవకాశం కలగనుంది.

ఫారం-6 సమర్పణపై ఆందోళనలకు తెర!

సాధారణంగా ఫారం-6లో మొదటిసారిగా ఓటరుగా నమోదు చేసుకుంటున్నట్లు డిక్లరేషన్ ఉంటుంది. అయితే ఇప్పటికే ఓటరుగా నమోదై ఉండి, ముసాయిదా జాబితాలో పేరు గల్లంతైన పాత ఓటర్లు ఈ ఫారం సమర్పిస్తే తప్పుడు సమాచారం ఇచ్చినట్లవుతుందా? తమపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టత ఇచ్చినట్లు వెల్లడైంది. పాత ఓటర్లు ఫారం-6 సమర్పించినంత మాత్రాన తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్లు పరిగణించరాదని, కేవలం ఈ కారణంతో వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 31 కింద కేసులు నమోదు చేయకూడదని మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం.

సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో కీలక పరిణామం

ఢిల్లీలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ, ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో పేర్లు తొలగించడంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. అర్హులైన ఓటర్లు ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోకూడదనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలుస్తోంది.

అర్హులైన ఓటర్లు ఏం చేయాలి?

ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు కనిపించని అర్హులైన పాత ఓటర్లు ఫారం-6 ద్వారా మళ్లీ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ఎన్నికల నమోదు అధికారి (ERO) పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో పేరు చేర్చే ప్రక్రియ చేపడతారు.

ఓటు హక్కు ప్రతి పౌరుడి హక్కు!

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. సాంకేతిక కారణాలు, జాబితా సవరణలు లేదా ఇతర కారణాలతో అర్హులైన పౌరుల పేర్లు ఓటర్ల జాబితా నుంచి గల్లంతైతే వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎన్నికల సంఘం సూచించిన విధానంలో తిరిగి దరఖాస్తు చేసుకుని తమ ఓటు హక్కును పొందేందుకు ప్రయత్నించవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!