📄 ePaper
Friday, November 13, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమరాఠీ గేట్ కాలువ కబ్జాపై అధికారులు స్పందించాలి!

మరాఠీ గేట్ కాలువ కబ్జాపై అధికారులు స్పందించాలి!

📰 Generate e-Paper Clip

–కాలువను ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు..

-నిలిచిపోతున్న వర్షపు నీటి ప్రవాహం – ప్రజలకు ఇబ్బందులు

సత్య వెలుగు న్యూస్ – పుత్తూరు ,నందిమంగళం: నందిమంగళం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 226లో కొండ ప్రాంతం చివరి నుంచి మరాఠీ గేట్ వరకు ప్రవహించే సహజ వర్షపు నీటి కాలువ ఆక్రమణలకు గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాలువను కొంతమంది అక్రమంగా ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని, కాలువ ఆనవాళ్లు సైతం కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మరాఠీ గేట్ వద్ద కాలువ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు సక్రమంగా ప్రవహించలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.

ఈ సమస్యపై ఇరిగేషన్ శాఖ అధికారులు, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ స్పందించి ఇప్పటివరకు తగిన చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, సర్వే నంబర్ 226లో కాలువకు సంబంధించిన హద్దులను గుర్తించాలని, కాలువను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మరాఠీ గేట్ కాలువను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!