📄 ePaper
Friday, November 13, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపుత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ బాలకృష్ణ మృతి!

పుత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ బాలకృష్ణ మృతి!

📰 Generate e-Paper Clip

-కేకేసీ కాలేజీ సమీపంలో లారీ–ఆటో ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, నవంబర్ 12: పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం సమీపంలోని కేకేసీ కాలేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుత్తూరు నుంచి నగరి వైపు వెళ్తున్న లారీ, అన్నా గౌరి ఆసుపత్రి నుంచి పుత్తూరు వైపు వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానికులు, సంబంధిత సిబ్బంది సహాయంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ దుర్ఘటనతో పరమేశ్వర మంగళం, పుత్తూరు పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!