📄 ePaper
Monday, July 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ల మధ్య గ్యాస్ బుకింగ్ కు 45 రోజుల గడువు

గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ల మధ్య గ్యాస్ బుకింగ్ కు 45 రోజుల గడువు

📰 Generate e-Paper Clip

పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల నిబంధన కొనసాగింపు

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పు చేసింది. ఇప్పటికే రెండు సిలిండర్ల మధ్య బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచిన సర్కారు తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువును ఏకంగా 45 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న 25 రోజుల నిబంధ ననే కొనసాగనుంది. ఏదేమైనా కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనతో గ్రామీణ ప్రాంతాల్లోని పెద్ద కుటుంబాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. 5 గురి కంటే ఎక్కువ మంది ఉండే కుటుంబానికి నెలలోపే ఒక గ్యాస్ సిలిండర్ అయిపోయే క్రమంలో మిగతా రోజులకు ఎలా అన్నది ప్రశ్నార్థకం కానుంది. కాగా, గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్ ను నిరోధించడానికే బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు రెండు రోజుల క్రితమే కేంద్రం తెలిపింది. గతంలో 55 రోజులకోసారి గ్యాస్ బుకింగ్ చేసుకున్న వారు.. ఇటీవల 15 రోజులకే గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నట్లు తమ దృష్టికొచ్చిన నేపథ్యంలోనే నిబంధనలు కఠినతరం చేసినట్లు వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!