📄 ePaper
Sunday, August 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్గ్రామీణాభివృద్ధికి భారీ నిధులు.. ఏపీ, తెలంగాణకు వేల కోట్ల కేటాయింపు

గ్రామీణాభివృద్ధికి భారీ నిధులు.. ఏపీ, తెలంగాణకు వేల కోట్ల కేటాయింపు

📰 Generate e-Paper Clip

దేశవ్యాప్తంగా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులను కేటాయించేందుకు ముందడుగు వేసింది. 16వ ఆర్థిక సంఘం (Finance Commission) సిఫార్సుల మేరకు గ్రామీణ స్థానిక సంస్థలకు వచ్చే ఐదేళ్ల కాలానికి భారీ గ్రాంట్లు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.

2026-27 నుంచి 2030-31 వరకు మొత్తం ₹4,35,236 కోట్ల నిధులను గ్రామీణ స్థానిక సంస్థలకు కేటాయించనున్నారు. ఈ నిధులు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల అభివృద్ధికి వినియోగించబడతాయి.

ఈ కేటాయింపుల్లో భాగంగా:
ఆంధ్రప్రదేశ్‌కు ₹16,627 కోట్లు
తెలంగాణకు ₹9,968 కోట్లు
లభించనున్నట్లు సమాచారం.
ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థలు వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. గ్రామాల రూపురేఖలు మార్చేలా ఈ నిధులు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.
16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం గ్రామీణ స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. గ్రామీణాభివృద్ధికి ఇది కీలకమైన ఆర్థిక బలంగా మారనుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!