చౌడేపల్లి, సెప్టెంబర్ 22, సత్య వెలుగు న్యూస్:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ఈ ఏడాది దసరా మహోత్సవాలను అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో, ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు.
దసరా ఉత్సవాలను కన్నులపండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మహోత్సవాల్లో పాల్గొనదలచిన ఉభయదారులు రూ.5,116 చెల్లించి అధికారిక రశీదు పొందవచ్చని తెలిపారు.
మరిన్ని వివరాల కోసం బోయకొండ గంగమ్మ దేవస్థానం కార్యాలయంలో సంప్రదించాలని ఈవో ఏకాంబరం కోరారు.

