📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపెళ్లకూరు మండలంలో 8 ఎంపీటీసీ నామినేషన్లు తిరస్కరణ 10 ఎంపీటీసీ స్థానాలకు 38 నామినేషన్లు.. 30...

పెళ్లకూరు మండలంలో 8 ఎంపీటీసీ నామినేషన్లు తిరస్కరణ 10 ఎంపీటీసీ స్థానాలకు 38 నామినేషన్లు.. 30 ఆమోదం

📰 Generate e-Paper Clip

పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:పెళ్లకూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 38 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం 30 నామినేషన్లు ఆమోదం పొందాయి. మరో 8 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

ఆమోదం పొందిన నామినేషన్లలో బీజేపీ నుంచి 2, జనసేన నుంచి 4, టీడీపీ నుంచి 19, వైఎస్సార్‌సీపీ నుంచి 5 ఉన్నాయి. తిరస్కరణకు గురైన వాటిలో టీడీపీ నుంచి 2, వైఎస్సార్‌సీపీ నుంచి 6 నామినేషన్లు ఉన్నట్లు సమాచారం.

ముగ్గురు అభ్యర్థులు డబుల్ నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది. నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలో రాజకీయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!