నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఇందులో భాగంగా 3వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పాలేటి నాగార్జున సోమవారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ఎన్ఎస్ఆర్ కాలనీ, రైల్వే స్టేషన్ రోడ్డు, రైల్వే క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటిస్తూ ఓటర్లను కలిశారు.
ప్రచారంలో భాగంగా ప్రతి వీధిలో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, మహిళలు, వృద్ధులు, యువతతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అమలు చేసిన అమ్మఒడి, చేయూత, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
ఈ సందర్భంగా పాలేటి నాగార్జున మాట్లాడుతూ.. 3వ వార్డులో పలు సమస్యలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఎన్ఎస్ఆర్ కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, రైల్వే స్టేషన్ రోడ్డులో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, తాగునీటి కొరత కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు.
తనకు అవకాశం కల్పిస్తే ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేసి, 3వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య ఉన్నా నేరుగా తనను సంప్రదించవచ్చని తెలిపారు.
నాయుడుపేట మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ప్రచారంలో కార్యకర్తల సందడి
పాలేటి నాగార్జున ప్రచారానికి పలుచోట్ల ప్రజల నుంచి స్పందన లభించింది. కొన్ని ప్రాంతాల్లో మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. యువకులు జై జగన్ నినాదాలతో ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో 3వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, యువజన విభాగం, మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

