📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఆదరించి గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం!

ఆదరించి గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం!

📰 Generate e-Paper Clip

-నాయుడుపేటలో వైసీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ప్రచారం

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 4వ, 5వ వార్డుల్లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలిశారు. తనను ఇంటి ఆడపడుచుగా భావించి ఆశీర్వదించి గెలిపించాలని, నాయుడుపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసి చూపిస్తామని ఆమె కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, మాజీ చైర్‌పర్సన్ కటకం దీపిక పాల్గొని రాజేశ్వరమ్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వార్డుల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అమలు చేసిన అమ్మఒడి, వైఎస్సార్‌ ఆసరా, చేయూత, విద్యాదీవెన, వసతి దీవెన, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ వంటి పథకాల గురించి ప్రజలకు వివరించారు.

మున్సిపాలిటీ సమస్యల పరిష్కారానికి కృషి

ఈ సందర్భంగా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ మాట్లాడుతూ.. నాయుడుపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యానికి సంబంధించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు.

ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి తనతో పాటు 4వ, 5వ వార్డుల వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

మహిళా నాయకుల మద్దతు

మాజీ ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. తంబిరెడ్డి రాజేశ్వరమ్మకు మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మాజీ చైర్‌పర్సన్ కటకం దీపిక మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ హయాంలో నాయుడుపేటలో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు. వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చి మహిళా చైర్‌పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మను గెలిపించాలని కోరారు.

ప్రచార సమయంలో పలుచోట్ల మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. యువత జై జగన్‌ నినాదాలు చేశారు. 4వ, 5వ వార్డుల్లో ప్రచారం కొనసాగింది.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తంబిరెడ్డి కుమార్‌రెడ్డి, కమతం బాబు, పట్టణ నాయకులు, 4వ, 5వ వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, మహిళా విభాగం, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!