తిరుపతి, సెప్టెంబర్ 22: డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను సెప్టెంబర్ 25లోపు అప్డేట్ చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందని సోషల్ మీడియా, వాట్సాప్‌లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
ఈ ప్రచారాన్ని నమ్మి వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే రవాణా శాఖ సేవలు, చలానాలు, లైసెన్స్ రెన్యువల్ తదితర సమాచారాన్ని సకాలంలో పొందేందుకు లైసెన్స్‌కు ప్రస్తుత మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకోవడం ప్రయోజనకరమని సూచించారు.
ధ్రువీకరించని సందేశాలను ఇతరులకు ఫార్వర్డ్ చేయకుండా, రవాణా శాఖకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక వర్గాల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని వాహనదారులకు సూచించారు




