📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిద్యార్థులు చిన్నతనం నుంచే శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలి: బల్లి ఆశిష్

విద్యార్థులు చిన్నతనం నుంచే శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలి: బల్లి ఆశిష్

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్ – నాయుడుపేట:
విద్యార్థులు చిన్నతనం నుంచే శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధ ఆలోచనలను పెంపొందించుకోవాలని జన విజ్ఞాన వేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు బల్లి ఆశిష్ సూచించారు. నాయుడుపేటలోని ఎల్.ఏ. సాగరం ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో సుమారు 560 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించి బ్లడ్ గ్రూపులను తెలియజేశారు. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవిస్తూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమానికి హెచ్‌ఎం డా. సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. జన విజ్ఞాన వేదిక నాయకులు, ఉపాధ్యాయులు, చేయూత అనాథ ఆశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!