📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుస్థానిక సమస్యలు తీరాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి – ఆమ్ ఆద్మీ...

స్థానిక సమస్యలు తీరాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి – ఆమ్ ఆద్మీ పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పండ్లూరు మణి

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్, గూడూరు:
స్థానిక సమస్యల పరిష్కారం కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని ఆమ్ ఆద్మీ పార్టీ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పండ్లూరు మణి పిలుపునిచ్చారు.

గూడూరు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల పరిష్కారంలో అధికార కూటమి ప్రభుత్వం విఫలమైందని పండ్లూరు మణి విమర్శించారు. ప్రజలు రాజకీయాల్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని, అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం ప్రజలు ముందుకు రావాలని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక ప్రభుత్వాలకు కల్పించిన అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గ్రామాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించేలా అవినీతి రహిత స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యావంతులు, మేధావులు, మహిళలు, సమాజ హితం కోరుకునే వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు.

సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఆమ్ ఆద్మీ పార్టీ సహకారం అందిస్తుందని పండ్లూరు మణి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!