📄 ePaper
Tuesday, November 10, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబీజేపీలోకి మునేశ్వర యాదవ్, నొకుల మధుకర్ చేరిక

బీజేపీలోకి మునేశ్వర యాదవ్, నొకుల మధుకర్ చేరిక

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్: భారతీయ జనతా పార్టీలోకి ఈస్ట్ మండల ఓబీసీ అధ్యక్షుడు మునేశ్వర యాదవ్, నొకుల మధుకర్ చేరారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో వారు బీజేపీ కండువా కప్పుకుని పార్టీలో చేరినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.

మునేశ్వర యాదవ్, నొకుల మధుకర్ పార్టీలో చేరడంతో స్థానికంగా పార్టీ కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని నాయకులు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సమస్యలపై పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నూతనంగా చేరిన నాయకులను కోరారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు నూతనంగా పార్టీలో చేరిన మునేశ్వర యాదవ్, నొకుల మధుకర్‌కు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!