సత్య వెలుగు న్యూస్, నాయుడుపేట: విన్నమాల పంట కాలువ సమస్యపై ప్రచురితమైన కథనానికి నాయుడుపేట మున్సిపల్ అధికారులు స్పందించారు. శనివారం జేసీబీలతో కాలువలో పూడికతీత పనులను ప్రారంభించారు. మార్కెట్ నుంచి ఆకుతోట వీధి, చాకలి కాలనీ, పొగటం కాలనీ, జైహింద్ కాలనీ మీదుగా బీడీ కాలనీ వరకు పనులు కొనసాగుతున్నాయి.
అయితే కాలువకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించి, డ్రైనేజీ నీరు కాలువలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కేవలం పూడికతీత పనులతో కాకుండా కాంక్రీట్ రిటైనింగ్ వాల్స్ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు, పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


