నాయుడుపేట, సెప్టెంబర్ 21 | సత్య వెలుగు న్యూస్
నాయుడుపేటలో జరిగిన వైఎస్సార్‌సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమష్టిగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
రైతుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, నియోజకవర్గ అభివృద్ధి తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామం, వార్డులో ప్రజలను కలుసుకుని స్థానిక సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

