చిల్లకూరు: పెళ్లకూరు మండలం చిల్లకూరు వడ్డిపాలెం వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూరియా లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.
తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో లారీ వడ్డిపాలెం వద్దకు చేరుకున్న సమయంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నట్లు సమాచారం. దీంతో వాహనంపై నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో లారీ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంతో రోడ్డుపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.


