చౌడేపల్లి, సెప్టెంబర్ 30 – సత్య వెలుగు న్యూస్
ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చౌడేపల్లి మండలంలో వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం బుధవారం అర్ధనగ్న నిరసన చేపట్టారు.
సెప్టెంబర్ 16 నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం చేపడుతున్న వీఆర్ఏలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వీఆర్ఏలు ప్రధానంగా ఈ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు:
- వీఆర్ఏలకు వేతన స్కేల్‌ను తక్షణమే అమలు చేయాలి.
- వీఆర్ఏల స్థానంలో పనిచేస్తున్న నామినీలను వీఆర్ఏలుగా నియమించాలి.
- అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలి.
- కారుణ్య నియామకాల ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలి.
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘ ప్రతినిధి సుమంత్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి రాజన్న, రెడ్డిప్ప, భాస్కర్, సావిత్రమ్మ, రెడ్డిరాజా, గంగులప్ప తదితర వీఆర్ఏలు, నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

