📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాగాలమ్మ గుడి స్థలం కబ్జా చేశారని ధర్మకర్తల ఆవేదన!

నాగాలమ్మ గుడి స్థలం కబ్జా చేశారని ధర్మకర్తల ఆవేదన!

📰 Generate e-Paper Clip

-గుడి ఆవరణలో ప్రహరీ గోడ నిర్మాణం.. అధికారుల జోక్యానికి డిమాండ్

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, అక్టోబర్ 27:తిరుపతి జిల్లా, పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు నందిమంగళం గ్రామంలో ఊరి ముందున్న నాగాలమ్మ గుడి స్థలం ఆక్రమణకు గురైందని గుడి ధర్మకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్ యాదవ్ అనే వ్యక్తి గుడి ఆవరణలో జేసీబీతో పనులు చేపట్టి, రైల్వే హద్దురాయిని తొలగించి గుడి ఆవరణలో నాటించారని, అనంతరం గుడి స్థలంలో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారని ధర్మకర్తలు ఆరోపించారు.

ఈ విషయంపై తాము ప్రశ్నించినప్పటికీ తమకు సరైన సమాధానం లభించలేదని వారు తెలిపారు. గుడికి సంబంధించిన స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.

అధికారులు స్పందించి విచారణ చేపట్టాలి!

నాగాలమ్మ గుడి స్థలానికి సంబంధించిన హద్దులను పరిశీలించి, ఆక్రమణ జరిగిందా లేదా అనే విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలని ధర్మకర్తలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గుడి స్థలాన్ని కాపాడటంతో పాటు తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!