– రిజల్ట్స్ సిఎక్స్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు
పుత్తూరు, అక్టోబర్ 7 ,సత్య వెలుగు న్యూస్ :
పుత్తూరు పట్టణం గోవిందపాలెంలోని శ్రీవిద్య డిగ్రీ కళాశాలలో బుధవారం మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ డ్రైవ్లో 36 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
బెంగళూరుకు చెందిన రిజల్ట్స్ సిఎక్స్ కంపెనీలో వివిధ ఉద్యోగాల కోసం నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్లేస్మెంట్ ఆఫీసర్ పి. వెంకట ప్రసాద్ తెలిపారు.
ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ అజిత్ నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ జి. ఉమామహేశ్వర్, ప్రిన్సిపాల్ ఎం. మాణిక్యం, అధ్యాపకులు ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకుని మంచి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని వారు ఆకాంక్షించారు.
జాబ్ డ్రైవ్ ద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులకు కళాశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

