📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి3వ వార్డు అభివృద్ధే లక్ష్యం.. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ జెమిని!

3వ వార్డు అభివృద్ధే లక్ష్యం.. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ జెమిని!

📰 Generate e-Paper Clip

-గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన

సత్య వెలుగు న్యూస్ | అక్టోబర్ 29 | నాయుడుపేట: నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 3వ వార్డు కౌన్సిలర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా శ్రీనివాస్ జెమిని పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన వార్డులోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ జెమిని మాట్లాడుతూ.. 3వ వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, తాగునీటి సరఫరా మెరుగుదల, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఎన్‌ఎస్‌ఆర్ కాలనీ, భరత్ నగర్, విన్నమాల రోడ్డు ప్రాంతాల ప్రజలు తనను తమ బిడ్డగా భావించి ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి తనకు మద్దతు తెలపాలని స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ జెమిని ప్రజలను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!