📄 ePaper
Friday, October 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికోట మండలంలో వైసీపీ ఎన్నికల దూకుడు.. 16 ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల పోటీ!

కోట మండలంలో వైసీపీ ఎన్నికల దూకుడు.. 16 ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల పోటీ!

📰 Generate e-Paper Clip

-కార్యకర్తలకు అండగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి.. ప్రచారంలో చురుకైన పాత్ర

సత్య వెలుగు న్యూస్ | అక్టోబర్ 30 | కోట:“గిరగిరా తిరుగుతుంది ఫ్యాను.. అబ్బా అయ్యా.. నేను జగనన్న ఫ్యాను!” అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తున్న నినాదాలు కోట మండల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. అధికారంలో లేకపోయినా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. కోట మండలంలోని మొత్తం 16 ఎంపీటీసీ స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలో నిలపడం స్థానిక రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల్లో పార్టీ ఉనికిని కొనసాగించాలనే లక్ష్యంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. కార్యకర్తల బలం, నాయకుల సమన్వయంతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

ఈ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పాత్ర స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు భరోసా కల్పించడం, నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకోవడం, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తున్నారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచుతూ, అభ్యర్థులకు మద్దతుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం, అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొనడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. అధికార కూటమి నాయకులు తమ వ్యూహాలతో ముందుకు సాగుతుండగా, వైసీపీ సైతం 16 ఎంపీటీసీ స్థానాల్లో పోటీకి సిద్ధమవడంతో కోట మండలంలో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది.

మొత్తంగా అధికార కూటమి వ్యూహాలు, ప్రతిపక్ష వైసీపీ ఎన్నికల సన్నద్ధత మధ్య కోట మండల ఎంపీటీసీ ఎన్నికలు స్థానిక రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ప్రచారం ముగిసే సమయానికి రాజకీయ సమీకరణాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!