📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యబోయకొండలో భక్తులను అలరించిన అమావాస్య చండీ హోమం

బోయకొండలో భక్తులను అలరించిన అమావాస్య చండీ హోమం

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి, అక్టోబర్ 10, సత్య వెలుగు న్యూస్:ప్రముఖ శక్తి క్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి నెలా అమావాస్య సందర్భంగా నిర్వహించే ఈ హోమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.

ఉదయాన్నే వేద పండితుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ హోమ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంతో చండీ హోమం ముగిసింది.

ఈ సందర్భంగా బోయకొండ గంగమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తిని చాటుకున్నారు. అమావాస్య సందర్భంగా నిర్వహించిన ఈ హోమ కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!