📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యస్థానిక సంస్థల ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన పోలీసులు

స్థానిక సంస్థల ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన పోలీసులు

📰 Generate e-Paper Clip

పుంగనూరు, అక్టోబర్ 10 ,సత్య వెలుగు న్యూస్: అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు పోలింగ్ కేంద్రాలను ముమ్మరంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా, సురక్షితంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నారు.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని జిల్లా పోలీసు యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!