📄 ePaper
Tuesday, November 10, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబీసీ కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర...

బీసీ కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌ డిమాండ్‌

📰 Generate e-Paper Clip

అమరావతి,సత్య వెలుగు న్యూస్‌: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదంటూ సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను కొట్టివేయడంపై బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌ స్పందించారు. ఈ తీర్పుతో చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన విధానం బయటపడిందని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వం వద్ద ఉన్నట్లు చెబుతున్న బీసీల జనాభాకు సంబంధించిన ఎంపైరికల్‌ డేటాను కోర్టులకు సమర్పించకుండా దాచిపెట్టిందని విమర్శించారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. 34 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తున్నారని పేర్కొన్నారు.

2027 జనాభా లెక్కల ద్వారా బీసీల జనాభాపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని, అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. బీసీల కులగణన పూర్తయి, జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

ఈ అంశంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా తన వైఖరిని స్పష్టం చేయాలని రామచంద్ర యాదవ్‌ అన్నారు. బీసీల డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే టీడీపీ, వైఎస్సార్‌సీపీలను బీసీలకు ద్రోహం చేసిన పార్టీలుగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు.

గ్రామ వార్డు సభ్యుల నుంచి లోక్‌సభ సభ్యుల వరకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలని ఆయన ప్రతిపాదించారు. బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!