📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపెళ్లకూరు మండలంలో బీజేపీ కార్యవర్గ సమావేశం పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలపై చర్చ

పెళ్లకూరు మండలంలో బీజేపీ కార్యవర్గ సమావేశం పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలపై చర్చ

📰 Generate e-Paper Clip

పెళ్లకూరు, అక్టోబర్ 4 (సత్య వెలుగు న్యూస్):
భారతీయ జనతా పార్టీ పెళ్లకూరు మండల కార్యవర్గ సమావేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు, మండల ఇన్‌చార్జి ముని సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షులు ఎద్దల నరేంద్రరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, మండల స్థాయిలో కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు మార్గనిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సమావేశానికి పార్టీ మండల అధ్యక్షులు కలిచేటి నరసింహులు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గోగుతోట్టు మురళి, జనరల్ సెక్రటరీలు భరత్, రమణ, చిల్లకూరు PACS డైరెక్టర్ ఎద్దల రామకృష్ణారెడ్డి, నాయకులు వీరయ్య, వెంకట్, బాలకృష్ణ, బుజ్జమ్మ, వరలక్ష్మి, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, సతీష్, పృథ్వి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!