నాయుడుపేట, అక్టోబర్ 18, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 22వ వార్డులో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ నుంచి పోటీ చేసేందుకు అవకాశం లభించకపోవడంతో బురకాల లీలామోహన్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 2026 అక్టోబర్ 17న తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో 22వ వార్డు నుంచి పోటీ చేస్తున్నట్లు లీలామోహన్ తెలిపారు. వార్డు అభివృద్ధికి కృషి చేయడంతో పాటు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.
వార్డు ప్రజల మద్దతుతో ఎన్నికల్లో ముందుకు సాగుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నామినేషన్ దాఖలుతో నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల్లో 22వ వార్డు పోటీపై ఆసక్తి నెలకొంది.

