📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిస్థానిక ఎన్నికల సమన్వయ బాధ్యతల్లో చింతపూడి పవన్ కళ్యాణ్,-తిరుపతి పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీ...

స్థానిక ఎన్నికల సమన్వయ బాధ్యతల్లో చింతపూడి పవన్ కళ్యాణ్,-తిరుపతి పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా ప్రతిపాదన

📰 Generate e-Paper Clip

పెళ్లకూరు, అక్టోబర్ 11,సత్య వెలుగు న్యూస్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామానికి చెందిన జనసేన నాయకుడు చింతపూడి పవన్ కళ్యాణ్‌కు కీలక బాధ్యతలు అప్పగించే ప్రతిపాదన ముందుకు వచ్చింది. తిరుపతి పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా ఆయన పేరును ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాల సమాచారం.

జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఉయ్యాల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది.

స్థానిక ఎన్నికల సన్నాహాల్లో భాగంగా గ్రామస్థాయిలో పార్టీ పరిస్థితులను అంచనా వేయడం, ప్రజల అభిప్రాయాలను సేకరించడం, స్థానిక సమస్యలను గుర్తించి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

చిల్లకూరు గ్రామానికి చెందిన చింతపూడి పవన్ కళ్యాణ్ అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. పార్టీ పరంగా కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఏర్పడటంపై అభిమానులు, పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ, ప్రజా సమస్యలను పార్టీ నాయకత్వానికి చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ సందర్భంగా చింతపూడి పవన్ కళ్యాణ్‌కు పలువురు అభిమానులు, జనసేన కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు మరింత చేరువగా ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!