📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేటలో సీవీఎస్‌కేటీ ఉచిత మెగా దంత వైద్య శిబిరం విజయవంతం

నాయుడుపేటలో సీవీఎస్‌కేటీ ఉచిత మెగా దంత వైద్య శిబిరం విజయవంతం

📰 Generate e-Paper Clip

-370 మందికి ఉచితంగా దంత పరీక్షలు, చికిత్సలు

-అవసరమైన వారికి తిరుపతిలోనూ ఉచిత వైద్యం: చదలవాడ కృష్ణమూర్తి

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్: సీవీఎస్‌కేటీ చారిటీస్ ఆధ్వర్యంలో శనివారం నాయుడుపేటలో నిర్వహించిన ఉచిత మెగా దంత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. చదలవాడ కృష్ణమూర్తి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 370 మందికి పైగా దంత పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం 34 మంది అనుభవజ్ఞులైన దంత వైద్యులు రోగులకు సేవలందించారు.

ఈ శిబిరంలో రూట్‌ కెనాల్‌ చికిత్స, దంతాల శుభ్రత, కృత్రిమ దంతాల అమరిక, పళ్ల తొలగింపు వంటి వైద్య సేవలను ఉచితంగా అందించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ నెల 5న రాజగోపాలపురంలో ప్రారంభమైన వైద్య సేవల్లో భాగంగా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికీ దంత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సంక్లిష్టమైన దంత సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి, తిరుపతిలోని ప్రత్యేక దంత ఆసుపత్రికి తరలించి ఉచితంగా చికిత్స అందిస్తామని చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఇందుకోసం అవసరమైన రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

వచ్చే వారంలో మరోసారి మెగా దంత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం చదలవాడ సుచరిత పర్యవేక్షణలో జరిగింది. వైద్య కళాశాల చీఫ్‌ డాక్టర్‌ శిరీషతో పాటు ఇతర వైద్యులు, సిబ్బంది శిబిరాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేశారు.

ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!