నాయుడుపేట, అక్టోబర్ 13, సత్య వెలుగు న్యూస్:ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు నిర్వహించ తలపెట్టిన ధర్నాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని సాయంత్రం విడుదల చేశారు.
ఈ క్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఇన్‌చార్జి కుక్కమల్లి రవి, నాయుడుపేట మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మొండెం నరేష్‌లను నాయుడుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టి. వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని సాయంత్రం విడుదల చేసినట్లు సమాచారం.
ధర్నా కార్యక్రమానికి అనుమతి లభించకపోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఎమ్మార్పీఎస్ నాయకుల స్పందన తెలియాల్సి ఉంది.

