📄 ePaper
Monday, November 2, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఆర్లపాడులో శ్రీకృష్ణ స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు

ఆర్లపాడులో శ్రీకృష్ణ స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు

📰 Generate e-Paper Clip

పెళ్లకూరు, అక్టోబర్ 5: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం ఆర్ధమాల పంచాయతీ పరిధిలోని ఆర్లపాడు గ్రామంలో శ్రీకృష్ణ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహించి అనంతరం శ్రీకృష్ణ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరిపారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణ కార్యక్రమం ఘనంగా సాగింది.

కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు ఆర్లపాడు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పండుగ వాతావరణం నెలకొంది. నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

శ్రీకృష్ణ స్వామివారి కల్యాణ మహోత్సవం విజయవంతంగా నిర్వహించడంతో గ్రామస్థులు, భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!