-సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా అభ్యర్థన
సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 1 | నాయుడుపేట:మండల ప్రజా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో విన్నమాల ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్ణ పద్మమ్మ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆదివారం పెరికలంపాటి కండ్రిగ, కమ్మవారిపాలెం, కారుమంచివారి కండ్రిగ గ్రామాల్లో పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని, భవిష్యత్తులోనూ ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.
చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, మురుగునీటి కాలువలు, పేదలకు నివాస గృహాలు, రైతులకు ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి కార్యక్రమాల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కర్ణ పద్మమ్మ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొనగా, పార్టీ నాయకులు తమ ప్రచారానికి మంచి స్పందన లభించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బల్లి ముత్యాలయ్య, బల్లి వెంకట కృష్ణయ్య, బల్లి సురేష్, దాసరి రాజా, కర్ణ సుధాకర్, కర్ణ వెంకట కృష్ణయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



