సత్య వెలుగు న్యూస్ ,పుత్తూరు ,నవంబరు 2: పుత్తూరు మండల రూరల్ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జై భాగ్యరాజ్ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు అడవికండ్రిగ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలను, ఓటర్లను కలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి, తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
వానను, ఎండను సైతం లెక్కచేయకుండా ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ప్రజల మధ్యకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల ఆశీస్సులు, మద్దతుతో భారీ మెజార్టీ సాధిస్తాననే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
సత్య వెలుగు న్యూస్, పుత్తూరు RC రిపోర్టర్ నగిరి: డా. ఎస్. సుధాకర్



