📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపరమేశ్వర మంగళంలో MRPS గ్రామ కమిటీ ఎన్నిక, MSP గ్రామ అధ్యక్షుడిగా పర్రి యుగంధర్‌ ఎన్నిక

పరమేశ్వర మంగళంలో MRPS గ్రామ కమిటీ ఎన్నిక, MSP గ్రామ అధ్యక్షుడిగా పర్రి యుగంధర్‌ ఎన్నిక

📰 Generate e-Paper Clip

పుత్తూరు, అక్టోబర్ 11 ,సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం గ్రామంలో MRPS (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. MRPS వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, MRPS–MSP తిరుపతి జిల్లా ఇన్‌చార్జ్ వర్ల దేవదాసు మాదిగ సూచనలతో, ‘గో టు విలేజ్’ రెండో విడత 50 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ కమిటీ ఏర్పాటు జరిగింది.

గ్రామ నాయకుడు ఎన్. శేషాద్రి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి MRPS తిరుపతి జిల్లా కో-ఇన్‌చార్జ్ పునబాకు మునివేలు మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ జాతి, సమాజం కోసం చేసిన సేవలను వివరించారు. సమాజంలో మాదిగలు ఎదుర్కొంటున్న అన్యాయాలు, వెనుకబాటుతనం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

అనంతరం గ్రామంలో ఆసక్తి కలిగిన వారిని కమిటీలోకి తీసుకుని నూతన కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో సంఘాన్ని బలోపేతం చేయడం, సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులు సూచించారు.

నూతన కమిటీ సభ్యులు

  • MSP గ్రామ అధ్యక్షుడు: పర్రి యుగంధర్
  • అధికార ప్రతినిధి: ఎన్. మణికంఠ
  • ఉపాధ్యక్షుడు: ఎన్. మహేష్
  • ప్రధాన కార్యదర్శి: ఎన్. శేషాద్రి
  • కోశాధికారి: ఎన్. శివరామకృష్ణ
  • కార్యదర్శి: చిట్టి
  • కార్యదర్శి: లక్ష్మి

గ్రామస్థాయిలో సంఘటితంగా పనిచేస్తూ సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల సాధన కోసం కృషి చేయాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!