📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎల్లసిరి గ్రామ అభివృద్ధే లక్ష్యం.. సర్పంచ్ బరిలో నవీన్ కోట!

ఎల్లసిరి గ్రామ అభివృద్ధే లక్ష్యం.. సర్పంచ్ బరిలో నవీన్ కోట!

📰 Generate e-Paper Clip

-రాజకీయ పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధం

-అవినీతిరహిత పాలన, పారదర్శక గ్రామాభివృద్ధే తన ధ్యేయమని వెల్లడి

సత్య వెలుగు న్యూస్ | చిట్టమూరు:

రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎల్లసిరి గ్రామ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు గ్రామానికి చెందిన యువకుడు నవీన్ కోట ప్రకటించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రజల ముందుకు రావాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువతీ యువకులు, స్నేహితుల ఆశీస్సులు, మద్దతు కోరారు.

అవినీతిరహిత పాలనే లక్ష్యం!

తనకు పెద్ద రాజకీయ పార్టీల అండగానీ, ఆర్థిక బలంగానీ లేకపోయినా గ్రామ అభివృద్ధి చేయాలనే సంకల్పం, నిజాయితీ ఉన్నాయని నవీన్ కోట పేర్కొన్నారు. గ్రామంలో తాగునీరు, సాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

పంచాయతీకి వచ్చే నిధులను పారదర్శకంగా వినియోగిస్తూ, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా గ్రామాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేసే పాలన అందించడమే తన ఆకాంక్షగా వివరించారు.

సామాన్యుడి పోరాటం.. యువకుడి ఆరాటం!

డబ్బు, అంగబలం ఉన్నవారే రాజకీయాల్లోకి రావాలా? గ్రామ అభివృద్ధిని కోరుకునే సామాన్యులు కూడా ప్రజాసేవ కోసం ముందుకు రావాలని నవీన్ కోట అభిప్రాయపడ్డారు.

గ్రామ ప్రజలు తనను తమ ఇంటి బిడ్డగా భావించి ఆశీర్వదించాలని కోరారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే గొంతుకగా నిలుస్తానని, అందరి సహకారంతో ఎల్లసిరి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ప్రజల ఆశీస్సుల కోసం ఎదురుచూపు!

రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు నవీన్ కోట వెల్లడించారు. పరిస్థితులు అనుకూలిస్తే త్వరలోనే నామినేషన్ దాఖలు చేసి ప్రజల ముందుకు వస్తానని తెలిపారు.

గ్రామ పెద్దలు, మహిళలు, యువత, స్నేహితులు తనకు ఆశీస్సులు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

“ఎల్లసిరి అభివృద్ధి కోసం మీలో ఒకడిగా.. మీ గొంతుకగా నిలబడతా” అంటూ నవీన్ కోట తన సందేశాన్ని వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!