📄 ePaper
Thursday, October 29, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివాకాడు చెరువు కట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. అయ్యప్ప మాలధారణలో ఉన్న ఇంటర్ విద్యార్థి...

వాకాడు చెరువు కట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. అయ్యప్ప మాలధారణలో ఉన్న ఇంటర్ విద్యార్థి దుర్మరణం!

📰 Generate e-Paper Clip

-మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.. శ్యామసుందరంపురంలో విషాదఛాయలు

వాకాడు, సత్య వెలుగు న్యూస్:తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని చెరువు కట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆటో బోల్తాపడిన ఘటనలో అయ్యప్ప మాలధారణలో ఉన్న 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థి అనుక్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన తీరు..

కోట మండలం శ్యామసుందరంపురం గ్రామానికి చెందిన బిందె శ్రీనివాసులు, మాధవి దంపతుల కుమారుడు అనుక్ (16) ఇంటర్ చదువుతున్నాడు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న అతడు, గ్రామానికి చెందిన ముగ్గురు వ్యాపారులతో కలిసి ఆటోలో చిట్టమూరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో వాకాడు చెరువు కట్ట వద్దకు చేరుకోగానే ఆటో అదుపుతప్పి బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనుక్ అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మాలధారణలోనే మృత్యువాత.. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

చేతికొచ్చిన కుమారుడు అయ్యప్ప మాలధారణలో ఉండగానే అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కుమారుడి మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ఘటనతో శ్యామసుందరంపురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!