📄 ePaper
Thursday, October 29, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేట అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది!

నాయుడుపేట అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది!

📰 Generate e-Paper Clip

-5వ వార్డులో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ విస్తృత ప్రచారం

సత్య వెలుగు న్యూస్ | నాయుడుపేట | అక్టోబర్ 29:నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా బుధవారం 5వ వార్డులో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, కూటమి బలపరిచిన టీడీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి షాకీరా, వార్డు అభ్యర్థి మైలారి అశోక్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, 5వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాయుడుపేట మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, వార్డులవారీగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

అభివృద్ధిపై ప్రతిపక్షాలది అసత్య ప్రచారం: విజయశ్రీ

గత ప్రభుత్వ హయాంలో కనీస అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టలేదని ఎమ్మెల్యే విజయశ్రీ విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు గమనించాలని, పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అవగాహనతో నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు.

నాయుడుపేట సమగ్ర అభివృద్ధే లక్ష్యం

నాయుడుపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడతామని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రజలకు వివరిస్తూ నాయకులు ముందుకు సాగారు.

ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!