📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యఏటిగడ్డపాలెంలో రామాలయ నిర్మాణానికి ముందుకొచ్చిన మాజీ బోయకొండ చైర్మన్ ఎస్‌కే రమణారెడ్డి

ఏటిగడ్డపాలెంలో రామాలయ నిర్మాణానికి ముందుకొచ్చిన మాజీ బోయకొండ చైర్మన్ ఎస్‌కే రమణారెడ్డి

📰 Generate e-Paper Clip

-ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కుటుంబ సమేతంగా భూమిపూజ చేస్తానని హామీ

పుంగనూరు, అక్టోబర్ 23, సత్య వెలుగు న్యూస్: అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు పట్టణ పరిధిలో ఉన్న ఏటిగడ్డపాలెంలో రామాలయ నిర్మాణానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, పురాతన ఆలయాల నిర్మాణానికి సహకరిస్తున్న పుంగనూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, బోయకొండ మాజీ చైర్మన్ ఎస్‌కే రమణారెడ్డి ముందుకొచ్చారు.

పట్టణంలోని తూర్పు మోసాల ప్రాంతం, భగత్‌సింగ్ కాలనీ, ఏటిగడ్డపాలెంలో నివసించే ప్రజల విజ్ఞప్తి మేరకు రాములవారి ఆలయ నిర్మాణానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. ఆలయ నిర్మాణానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే భూమిపూజ

ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఎన్నికలు పూర్తయిన వెంటనే వార్డు ఇన్‌ఛార్జి మధుసూదన్ నాయుడుతో కలిసి తన కుటుంబ సభ్యులతో సహా ఏటిగడ్డపాలెంకు వచ్చి రామాలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తానని ఎస్‌కే రమణారెడ్డి హామీ ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు.

గ్రామస్తుల హర్షం

తమ ప్రాంతంలో రామాలయ నిర్మాణానికి సహకరించేందుకు ముందుకు రావడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 7 గంటలపాలెంకు చెందిన చంద్ర, శాంతమ్మ, వసంతమ్మ, కృష్ణ, రెడ్డప్పతో పాటు ఏటిగడ్డపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!