📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యచౌడేపల్లిలోఘనంగా మాజీమంత్రిపెదిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు.

చౌడేపల్లిలోఘనంగా మాజీమంత్రిపెదిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు.

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి ,అక్టోబర్ 11 ,సత్య వెలుగు న్యూస్:మండల కేంద్రమైన చౌడేపల్లి గ్రామీణ ప్రాంతాలలో రాష్ట్ర మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా గ్రీవెన్స్ సెల్ సభ్యుడు పవన్ రాయల్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండు యానాది కాలనీలలో అన్నదానం యానాదులు వారి పిల్లలకు వస్త్ర దానాలు చేశారు. మండల వైకాపా అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో కొలింపల్లి క్రాస్ వద్ద కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు చేసిన సేవలను అందరికీ వివరించారు. రాబోయే ఎన్నికలలో వైకాపా అన్ని స్థానాలలోనూ గెలుచుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డి మరిన్ని పదవులు అలంకరించి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు దామోదర్ రాజు రుక్మిణమ్మ కూరపర్తి అంజిబాబు మిద్దింటి కిషోర్ కళ్యాణ్ భరత్ అనుప్రియ లావణ్య శ్రీరాములు జంగాలపల్లి రమణ ఖానాదార్ నాగరాజా సుబ్రమణ్యం రాజు అల్తాఫ్ భాస్కర్ హరీష్ గిరి రామ్ కి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!