-జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌పై కీలక ప్రకటన..
-ఓట్ల లెక్కింపు తేదీలు ఇవే!
పెళ్లకూరు, సత్య వెలుగు : ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీల వివరాలను పెళ్లకూరు మండల ఎంపీడీఓ డాక్టర్ సి. వేణయ్య వెల్లడించినట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు ఈ తేదీలను గమనించాలని సూచించారు.
ముఖ్యమైన తేదీలు
- నవంబర్ 3: పోలింగ్
- నవంబర్ 5: జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- నవంబర్ 7: ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం జారీ చేసే అధికారిక మార్గదర్శకాలను అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

