📄 ePaper
Thursday, October 29, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేట మున్సిపాలిటీ వైసీపీదే!

నాయుడుపేట మున్సిపాలిటీ వైసీపీదే!

📰 Generate e-Paper Clip

-చైర్మన్‌ పీఠంతో పాటు మెజారిటీ కౌన్సిలర్‌ స్థానాలు గెలుస్తాం

-వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ధీమా

నాయుడుపేట, అక్టోబర్ 28 ,సత్య వెలుగు న్యూస్:జరగనున్న నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్‌ పదవితో పాటు మెజారిటీ కౌన్సిలర్‌ స్థానాలను కైవసం చేసుకుని, ఆ విజయాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి కానుకగా అందిస్తామని సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కార్యకర్తలకు ఆయన ఈ సందేశాన్ని అందించారు.

ఈ సందర్భంగా కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, నాయుడుపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రెడ్డి సామాజిక వర్గ కీలక నాయకులను స్థానిక పోలీసులు గత కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు నమోదు చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధించాలనే ధోరణిని అధికార పార్టీతో పాటు పోలీసులు కూడా విడనాడాలని సూచించారు.

తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకున్నా, నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని సంజీవయ్య వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ప్రజలు విశ్వాసం చూపుతారని, చైర్మన్‌ పీఠంతో పాటు మెజారిటీ కౌన్సిలర్‌ స్థానాలను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నాయుడుపేట మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!