📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినెల్లూరు జిల్లాలో సీనియర్ మెన్, ఉమెన్ రెజ్లింగ్ జట్టు ఎంపికలు రేపే!

నెల్లూరు జిల్లాలో సీనియర్ మెన్, ఉమెన్ రెజ్లింగ్ జట్టు ఎంపికలు రేపే!

📰 Generate e-Paper Clip

-రెట్టపల్లి జడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సెలక్షన్స్

నెల్లూరు,సత్య వెలుగు న్యూస్:  నెల్లూరు జిల్లా సీనియర్ పురుషులు, మహిళల సంప్రదాయ రెజ్లింగ్ జట్టు ఎంపికలు రేపు రెట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు నెల్లూరు జిల్లా రెజ్లింగ్ కార్యదర్శి ఎం. శివయ్య తెలిపారు.

ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. 20 సంవత్సరాలు పైబడిన క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొనవచ్చు. 18–19 సంవత్సరాల వయస్సు కలిగిన క్రీడాకారులు తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాలని తెలిపారు.

పురుషుల విభాగం వెయిట్ కేటగిరీలు

  • 57 కేజీలు
  • 65 కేజీలు
  • 74 కేజీలు
  • 86 కేజీలు
  • 97 కేజీలు
  • 118 కేజీలు

మహిళల విభాగం వెయిట్ కేటగిరీలు

  • 50 కేజీలు
  • 53 కేజీలు
  • 57 కేజీలు
  • 62 కేజీలు
  • 68 కేజీలు
  • 76 కేజీలు

జిల్లా జట్టు ఎంపికల్లో పాల్గొనాలనుకునే క్రీడాకారులు నిర్ణీత సమయానికి అవసరమైన పత్రాలతో హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు.

మరిన్ని వివరాలకు సంప్రదించండి: 7674034951

సత్య వెలుగు న్యూస్ | క్రీడా వార్తలు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!