సత్య వెలుగు న్యూస్ | అక్టోబర్ 24 | నాయుడుపేట:ఓజిలి మండలం సగుటూరు ఎంపీటీసీ అభ్యర్థిగా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున నాగిశెట్టి తులసమ్మ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మెజారిటీ ప్రజల హక్కుల కోసం పనిచేసే పార్టీ అని పేర్కొన్నారు. సగుటూరు ఎంపీటీసీ సెగ్మెంట్ ప్రజలందరూ బీఎస్పీ ఏనుగు గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
సగుటూరు సెగ్మెంట్ పరిధిలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, రహదారుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులు కూడా అనేక కష్టాలు పడుతున్నారని వివరించారు.
తనను బీఎస్పీ ఏనుగు గుర్తుపై గెలిపిస్తే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజాసేవకు అంకితమవుతానని నాగిశెట్టి తులసమ్మ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ తిరుపతి పార్లమెంట్ ఇన్‌చార్జి కర్లపూడి ఆదయ్య, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు కలపాటి రామయ్య, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




