వెంకటగిరి: గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో భాగంగా వెంకటగిరిలో అమ్మవారి ప్రతిమను సిద్ధం చేశారు. కుమ్మరివీధిలోని కుమ్మరి మండపంలో ప్రతిమ తయారీ కార్యక్రమం పూర్తయింది.
అర్ధరాత్రి జీనిగలవారివీధిలోని చాకలి మండపంలో అమ్మవారి ప్రతిమకు కళ్లు, దిష్టిచుక్క పెట్టి సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అమ్మవారి ప్రతిమను రథంపై ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించనున్నారు.
ప్రతిష్ఠ అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. జాతర సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

