📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికష్టకాలంలో నిరుపేద కుటుంబానికి అండగా పుత్తూరు పోలీసులు

కష్టకాలంలో నిరుపేద కుటుంబానికి అండగా పుత్తూరు పోలీసులు

📰 Generate e-Paper Clip

-మానవత్వాన్ని చాటుకున్న సీఐ నెట్టికంటయ్య, ఎస్ఐ నాగేంద్రబాబు

పుత్తూరు, అక్టోబర్ 10 ,సత్య వెలుగు న్యూస్: కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి పుత్తూరు పోలీసు అధికారులు మానవత్వాన్ని చాటుకున్నారు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం నందిమల గ్రామానికి చెందిన ఏ. మురగయ్య భార్య ఏ. మంజుల కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగించలేని పరిస్థితిలో ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న పుత్తూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నెట్టికంటయ్య , సబ్‌ ఇన్‌స్పెక్టర్ నాగేంద్రబాబు వెంటనే స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. తక్షణ సహాయంగా బియ్యం బస్తాతో పాటు ఆర్థిక సాయాన్ని అందజేశారు.

చట్టాన్ని అమలు చేయడమే కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం కూడా పోలీసుల బాధ్యతలో భాగమేనని ఈ సహాయ కార్యక్రమం చాటిచెప్పింది. కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి భరోసా కల్పించిన పోలీసు అధికారుల సేవా దృక్పథంపై పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందించడంతో పాటు, ప్రజలకు పోలీసు శాఖపై నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తాయని పలువురు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!