📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్‌.. కొత్త తేదీలు ఇవే!

ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్‌.. కొత్త తేదీలు ఇవే!

📰 Generate e-Paper Clip

అమరావతి, సత్య వెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు సమాచారం. ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్‌ 1వ తేదీకి వాయిదా వేసినట్లు వెల్లడైంది.

అక్టోబర్‌ 25న మధ్యాహ్నం 3 గంటలతో అభ్యర్థుల ప్రచార గడువు ముగియనుండగా, నవంబర్‌ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. అవసరమైతే నవంబర్‌ 2న రీపోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది.

నవంబర్‌ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. మైదుకూరు సహా మరో మూడు పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణను అక్టోబర్‌ 23, 24 తేదీల్లో చేపట్టనున్నట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!